మనప్రగతి న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లకు పెండింగ్లో ఉన్న మూడు నెలలు వేతనాలు వెంటనే విడుదల చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉప్పేర్ నరసింహ, వివి నరసింహ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ నర్సింగ్ రావుకి వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లకు గత మూడు నెలల నుండి వేతనాల పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.స్వీపర్ల వేతనాలకు సంబంధించిన నిధులు మంజూరు అయినప్పటికీ, మండల విద్యాధికారులు వర్క్ డన్ పంపకపోవడంతో కార్మికుల వేతనాలు పెండింగ్లో ఉన్నాయని అన్నారు.కలెక్టర్ అప్రూవల్ తీసుకున్నప్పటికీ కొంతమంది మండల విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే వేతనాలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల స్వీపర్ల వేతనాల విడుదల విషయంలో ప్రతిసారి అధికార యంత్రాంగం మధ్య సమన్వయం లోపం స్పష్టంగా కనిపిస్తున్నదని తెలిపారు.గత విద్యా సంవత్సరంలో పని చేసిన స్వీపర్లకు వేతనాలు విడుదల చేసి మూడు నెలలు కావొస్తునప్పటికి, ఇప్పటికి కొంతమంది అమ్మ ఆదర్శ పాఠశాలల చైర్మన్లు వేతనాలు ఇవ్వకుండా స్వీపర్లను ఇబ్బందుల గురి చేస్తున్నారని అన్నారు. పాఠశాలల స్వీపర్లకు సక్రమంగా వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందుల గురిచేస్తున్న ఏఏపీ చైర్మన్ లను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలతో సంబంధం లేకుండా నేరుగా కార్మికుల ఖాతాలో వేతనాలు జమ చేయాలని,తాత్కాలికంగా ప్రధానోపాధ్యాయులు స్వీపర్లకు వేతనాలు ఇచ్చే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. స్వీపర్లకి ఇచ్చే వేతనాలు నెల నెల సక్రమంగా అందజేయాలని, సంవత్సరం మొత్తం వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.కావున వర్క్ డన్ పంపకుండా ఆలస్యం చేస్తున్న మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని,పెండింగ్లో వేతనాలు విడుదల చేయడంతో పాటు స్వీపర్ల వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న ఏఏపీ చైర్మన్లను సైతం తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల స్వీపర్ల సంఘం పట్టణ అధ్యక్షుడు రఘు, కార్మికులు మురళి, మల్లమ్మ పాల్గొన్నారు.

