Breaking News

పంచాయతీ కార్యదర్శి పై అవినీతి ఆరోపణ !

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:

శంకరపట్నం మండలం లో ప్రభుత్వ ఉద్యోగులు మధ్యవర్తులను పెట్టుకుని అమాయక ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తూ వేధిస్తున్నారు.మండల పరిధిలోని మొలంగుర్ గ్రామపంచాయతీ కార్యదర్శి నిదర్శనం. మొలంగూర్ ఆర్.ఎం.పి వ్యక్తిని పెట్టుకునే డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధితురాలు గ్రామ సర్పంచ్ కు ఫిర్యాదు చేసింది.శంకరపట్నం మండల సర్పంచ్ ఫోరం అధ్య క్షుడు కొయ్యడ పరశురాములు,మొలంగురు గ్రామసర్పంచ్ పూదారి రాజు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ మొలంగూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటి మార్పు విషయం పై ఆర్ఎంపి డాక్టర్ ను నియమించి పంచాయతీ కార్యదర్శి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆధారాలతో తెలిపారు. మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ బాధితురాలతో కలిసి జిల్లా కలెక్టర్ కు ప్రజావాణి లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో వార్డు మెంబర్ శేఖర్, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గుల్ల పాపన్న,బి.ఆర్.ఎస్ యూత్ అధ్యక్షుడు నల్ల రవీందర్ రెడ్డి, యూసఫ్ పాల్గొన్నారు.

జన్నారం రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు