Breaking News

ఖమ్మం జిల్లాలో కేటీఆర్ పర్యటన..

రేపు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్న వర్కింగ్ ప్రెసిడెంట్..

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ :

ముద్రగడ పద్మనాభం మరణం పట్ల మాజీ మంత్రి పువ్వాడ సంతాపం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల ‌07 బుధవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొననున్నారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు నిర్వహించే ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ పై నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రానున్న రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై ఉద్యమ కార్యాచరణపై ఆయన కీలక సూచనలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.ఈ సమావేశానికి జిల్లా, మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.