మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:
పేకాట స్థావరంపై పోలీసులు దాడిచేసి పేకాట ఆడుతున్న నలుగురి ని అరెస్టు చేశారు.ఈ ఘటన శంకరపట్నం మండలం కేశవపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని మొలంగూర్ శివారులో కొందరు వ్యక్తులు పేకాడు తున్నట్లు సమాచారం అందింది. ఈమేరకు పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు.పేకాడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టుచేసి వారి నుంచి రూ.1470 నగదు,నాలుగు సెల్‌ఫోన్లు,రెండు సెట్ల ప్లేయింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

