Breaking News

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు

(మన ప్రగతి న్యూస్ కరీంనగర్ జిల్లా స్టాఫర్) జనవరి-7

కరీంనగర్ జిల్లా రవాణాశాఖ మరియు ట్రాఫిక్ పోలీసుల ఉమ్మడి నిర్వహణలో
రహదారులపై మితిమీరిన వేగంతో నడుస్తున్న వాహనాల తో పెద్ద మొత్తంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేఫధ్యంలో వాటిని నియంత్రించడానికి ఈ రోజు
కరీంనగర్ రామగుండం స్టేట్ హైవే యస్.హెచ్ 1 పై వాహనాల ఛోదకులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్య క్రమం లో భాగం గా పరిమితికి మించిన వేగంతో వాహనాలను నడపడం చట్ట రీత్యా నేరము శిక్షార్హమే కాదు,ప్రాణాంతకం కూడాననే చట్ట నిబంధనలను వాహనాల ఛోదకుల కు తెలియ జేయడం జరిగింది.ఉదయం పది గంటల నుండి రెండు గంటల వరకు రేణికుంట టోల్ ప్లాజా కన్నా ముందు నుస్తులాపూర్ దగ్గర స్టేట్ రహదారి పై జరిగిన ఈ తనిఖీ లో మితిమీరిన వేగము తో పయనించిన పది వాహనాలకు ఫైన్ విధించడంతో పాటు అధిక వేగ నియంత్రణ పై అవగాహన కలిగించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్పి.పురుషోత్తం,ఆర్.టి.ఏ. మెంబర్ పడాల రాహుల్,డి.టి.ఓ శ్రీకాంత్ చక్ర వర్తి,రక్షణ రోడ్ సేఫ్టీ ఫౌండేషన్ కో ఆర్డి నేటర్ డాక్టర్ నీలం సంపత్,ట్రాఫిక్ యస్.ఐ. ఆఫ్ పోలీస్ సురేష్ వర్మ తో పాటు రవాణాశాఖ మరియు ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

జన్నారం రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు