Breaking News

రెడ్ క్రాస్ జిల్లా కమిటీ వారిచే సిపిఆర్ గురించి అవగాహన

మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి:

బీబీనగర్ మండలంలో పరిధిలోని కొండమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెడ్ క్రాస్ జిల్లా కమిటీ వారిచే విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు సిపిఆర్ గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మండల విద్యాధికారి సురేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో గుండెకు సంబంధించిన వ్యాధులు ఎక్కువ కావడం వలన సీపీఆర్ అనేది అత్యవసరమని అన్నారు.విద్యార్థులు యువకులు,ప్రతి ఒక్కరు సిపిఆర్ పై అవగాహన పెంచుకోవడం ప్రస్తుతం ఎంతో అవసరమని తెలిపారు.ఈ కార్యక్రమ నిర్వాహకులు రెడ్ క్రాస్ జిల్లా కమిటీ డైరెక్టర్ డాక్టర్.శేక్ హమీద్ పాష మాట్లాడుతూ ప్రతి మనిషికి ఆకస్మికంగా అవసరం పడే ఈ సిపిఆర్ ద్వారా వైద్య సేవలు అందించవచ్చు అని అన్నారు.ప్రస్తుత పరిస్థితులలో ప్రతి మనిషికి హార్ట్ స్ట్రోక్ రావడం అనేది సాధారణం అయిపోయింది అని,అటువంటి పరిస్థితుల్లో సిపిఆర్ ద్వారా మనిషిని బ్రతికించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు.విద్యార్థులు చదువుతోపాటు ఇలాంటి వైద్య అవసరాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.మోట కొండూరు పి.హెచ్.సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయ్ కుమార్ సీపీఆర్ చేసే విధానాన్ని తెలియజేస్తూ విద్యార్థులచే ప్రాక్టీస్ కూడా చేయించడం జరిగింది.పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.ఉమాదేవి ఇట్టి కార్యక్రమానికి అధ్యక్షత వహించగా,రెడ్ క్రాస్ సభ్యులు మంచాల అనిల్ కుమార్,పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

జన్నారం రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు