- మంటలను అదుపు చేసిన పోలీస్ ఫైర్ సిబ్బంది.. మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి:
మండలంలోని రంగాపురం గ్రామం లో ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధ మైన సంఘటన చోటుచేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. ఇదే గ్రామానికి చెందిన పాలెపు రఘు కు సంబంధించిన నాలుగు ఎకరాల గడ్డివాము పశు వుల మేత కోసం నిల్వ చేశాడు. ఈ నేపథ్యంలో ప్రమాదవశాత్తు ఆ గడ్డివాముకు నిప్పు అంటుకొని భారీగా మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు 100 కు ఫోన్ చేశారు. దీంతో పోలీస్ సిబ్బం ది, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలా నికి చేరుకొని స్థానికుల సహకారం తో మంటలను అదుపు చేశారు. అప్పటికే ఎక్కువ భాగం గడ్డివాము దగ్ధమైనట్లు బాధిత రైతు కన్నీరు మున్నీరయ్యారు.

