మన ప్రగతి న్యూస్/ నడికూడ:
క్రీడల వల్ల మానసిక ఆరోగ్యం, ప్రశాంతత మెరుగుపడుతుందని, విద్యార్థులు క్రీడ ల్లో రాణించాలని హనుమకొండ అడిష నల్ కలెక్టర్ నిడగుగొమ్ముల రవి అన్నారు. శుక్రవారం నడికూడ మండల కేంద్రంలోని తహాసిల్దార్ కార్యాల యంలో సీఎం కప్ క్రీడాజ్యోతిని ఆయన ప్రారంభించారు. క్రీడలతో ఆరోగ్యం మెరుగుపడుతుందని విద్యార్థులు,యువతీ యువకులు ప్రతి ఒక్కరూ క్రీడల్లో రాణించి విజయం సాధిం చాలని కోరారు. క్రీడలతో ప్రత్యేక గుర్తిం పు ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ డాక్టర్. కె నారాయణ, తహాసిల్దార్ రాణి, ఎంఈఓ హనుమంత రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

