Breaking News

సమ్మక్క సారలమ్మ వనదేవతల జాతరలను ఘనంగా నిర్వహించాలి

  • ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి

మన ప్రగతి న్యూస్/ స్టేషన్ ఘన్‌పూర్ .ప్రతినిధి:
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలో సమ్మక్క సారలమ్మ జాతరలను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య , స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు శనివారం జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని రైతు వేదికలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలో జరగనున్న మినీ సమ్మక్క సారలమ్మ జాతరల ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా జాతర కమిటీ చైర్మన్లను, సర్పంచులను జాతరలో చేయాల్సిన ఏర్పాట్లను, తీసుకోవాల్సిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ భక్తుల భద్రత, సౌకర్యాలే ప్రధాన లక్ష్యంగా మినీ మేడారం జాతర ఏర్పాట్లు కొనసాగాలని ఆమె అధికారులకు సూచించారు. జాతర నిర్వహణలో ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నట్లయితే వాటిని వెంటనే సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతర కావడంతో, కేటాయించిన నిధులను సమర్థవంతంగా వినియోగించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రత్యేకంగా శానిటేషన్, త్రాగునీరు, రహదారులు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక సదుపాయాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని, వివిధ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి జాతరను అత్యంత వైభవంగా నిర్వహించాలని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో 8ప్రాంతాలలో జరిగే సమ్మక్క సారలమ్మ వనదేవతల జాతరలను ఘనంగా నిర్వహించాలని అన్నారు.నియోజకవర్గ పరిధిలో జాతరల నిర్వహణకు 54లక్షలు మంజూరు అయ్యాయని తెలిపారు. ప్రతీ జాతరకు తహసీల్దార్ ఇంచార్జ్ గా విద్యుత్, మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్, పోలీస్ శాఖల అధికారులతో పాటు జాతర కమిటీ చైర్మన్లు, సర్పంచులుతో కమిటీ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కమిటీ 12తేదీలోపు చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రతిపాదనలు సిద్ధం చేసి 13వ తేదీన కలెక్టర్ కి అందించాలని సూచించారు. జాతరలో 24గంటలు విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జాతర ప్రాంతాలలో పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని పోలీస్ అధికారులకు సూచించారు. అనంతరం జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాష మాట్లాడుతూ
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాతరలను నిర్వహించాలని అన్నారు. తహసీల్దార్, ఎంపిడివోలు ఇంచార్జ్ గా కమిటీలు 12వ తేదీలోగా ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. జాతర వద్దకు రోడ్డు ఫార్మేషన్, విద్యుత్, మిషన్ భగీరథ ద్వారా తాగు నీరు, పారిశుధ్యం వంటి వసతులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖలు సమర్థవంతంగా పని చేయాలని అన్నారు. ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా జాతరలను విజయవంతంగా నిర్వహించాలని ఇందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ఆర్డివో వెంకన్న, ఏసీపీ భీమ్ శర్మ, వివిధ శాఖల ఎస్సిలు, డీఈలు, ఏఈలు, సిఐలు, ఎస్సైలు, సర్పంచులు, జాతర కమిటీ చైర్మన్లు, నాయకులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు