Breaking News

రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి 

ఎమ్మెల్యే యశస్విని రెడ్డి 

కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ 

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు

రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అందించేందుకు కృత నిశ్చయంతో పనిచేస్తున్నామని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు.శనివారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 116 మందికి రూ,1 కోటి16 లక్షల 13 వేల 456 విలువైన చెక్కులను, కొడకండ్ల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 35 మంది లబ్ధిదారులకురూ, 45 లక్షల 5 వేల 220 విలువైన చెక్కులను, దేవరుప్పుల మండలంలోని 94 మంది కి రూ,94 లక్షల పదివేల 904 విలువైన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల కళ్ళలో ఆనందాన్ని చూడాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు అందించడంలో సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న పాత్ర పోషించి పేద కుటుంబాలకు అండగా ఉంటున్నాడని తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గం అగ్రభాగాన ఉందని అన్నారు. ప్రభుత్వ పథకాలు పొందిన లబ్ధిదారులు రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఎంపీటీసీ, జడ్పిటిసిలుగా గెలిపించాలని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అర్హులైన పేదలందరూ అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని, కనీసం చెక్కులు అందుకోలేని దుస్థితిలో ఉన్నారని తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా సంప్రదించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లావుడియా మంజుల, కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈ రెంటి సాయి కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, పాలకుర్తి, కొడకండ్ల దేవరుప్పుల మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, ధరావత్ సురేష్ నాయక్, నల్ల శ్రీరాములు, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు,దేవస్థాన మాజీ చైర్మన్ చిలువేరు కృష్ణమూర్తి, జిల్లా మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి మదర్,వివిధ గ్రామాల సర్పంచులు మాచర్ల స్వరూప పుల్లయ్య,జుట్ట బోయిన రమ్య, ముస్కు సుధాకర్ రెడ్డి, గాదరి కుమారస్వామి, బాలగాని రజిత యాకయ్య గౌడ్, కారుపోతుల శ్రీనివాస్ గౌడ్, దేవరుప్పుల గ్రామ సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్, తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు మహేందర్ రెడ్డి, భాస్కర్ గౌడ్, శ్రీనివాస్, మణేమ్మ, గడ్డం యాక సోమయ్య, తదితరులు పాల్గొన్నారు.