Breaking News

సంక్రాంతికి ఊరెళ్తున్నారా. జరభద్రం

_ గ్రామాల్లో పట్టణాల్లో అనుమానితుల కదలికలపై సమాచారం అందించాలి.

_ కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకోవాలి..

_ జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

ముద్రగడ పద్మనాభం మరణం పట్ల మాజీ మంత్రి పువ్వాడ సంతాపం

మన ప్రగతి న్యూస్ / సిరిసిల్ల జిల్లా స్టాపర్ :

సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా మంది సొంత ప్రాంతాలకు,బంధువుల ఇండ్లకి,విహార యాత్రలకు ప్రయాణాలు చేస్తారు.ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు.సంక్రాంతి పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని, ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు.రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నామన్నారు.దీనికి అనుగుణంగా జిల్లా ప్రజలు సైతం పోలీస్ వారి సలహాలు, సూచనలు పాటిస్తూ సహకరించాలని కోరారు.మీ గ్రామం, పట్టణం, కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసు స్టేషన్ కు తప్పనిసరిగా సమాచారం ఇవ్వండి.డయల్ 100కు కాల్ చేయండి. ప్రజలు పోలీస్ శాఖ వారి సూచనలు పాటిస్తూ సహకరిస్తే చోరీల నియంత్రించడం సులభం అవుతుందని ఎస్పీ తెలిపారు..