మన ప్రగతి న్యూస్/సైదాపూర్:
సైదాపూర్ మండలంలో సుప్రసిద్ధ ప్రసిద్ధమైన శ్రీ స్వయంభు సమ్మక్క సారలమ్మ జాతర ఆలయ నూతన కమిటీని శనివారం 6 గ్రామాల పెద్దల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా సారాబుడ్ల సమ్మిరెడ్డి,ఉపాధ్యక్షుడిగా దొకిడి తిరుపతి లు నియమితులయ్యారు. సమ్మిరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్న ఆరు గ్రామాల పెద్దలకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.ఆలయ అభివృద్ధిని 6 గ్రామాల ప్రజలతో మమేకమై అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు.

