మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:
ఫ్రీ విల్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని ఈరవెన్ను గ్రామములో వృద్ధులకు నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు కొడిశాల వినయ్, సంస్థ అడ్వైజర్ కుడిశాల బాబు మాట్లాడుతూ పేదలకు వృద్ధులకు సేవ చేయడమే మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. గ్రామంతో పాటు పలు గ్రామంలోని వంద మందికి పైగా వృద్ధులకు దుప్పట్లతో పాటు భోజనం అందజేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాదరి కుమారస్వామి, లొంక ఐలయ్య, బిర్రు సోమేశ్వర్, జక్కుల రాజు, కొడిశాల బాబు, మహేందర్, డీలర్ కొడిశాల శోభారాణి, పాస్టర్లు జాకోబ్ ఇశ్రాయిల్, మైఖేల్, సంస్థ చైర్మన్ కొడిశాల మానస, ప్రధాన కార్యదర్శి కొడిశాల పవన్ కళ్యాణ్, కోశాధికారి అలువాల నవీన్ పాల్గొన్నారు.

