మన ప్రగతి న్యూస్/శంకరపట్నం
శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన జనగాం శ్రీనివాస్ గత తొమ్మిది సంవత్సరాలుగా అయ్యప్ప మాలదారులకు మహా అన్నదాన ప్రసాదం కార్యక్రమం నిర్వహిస్తున్నారు.శనివారం మణికంఠ ఆశ్రమ శిష్య బృందం ఆధ్వర్యంలో జనగాం శ్రీనివాస్ కు అయ్యప్ప స్వామి చిత్రపటాన్ని బహుకరించి చిరు సత్కారం చేశారు.మణికంఠ ఆశ్రమ శిష్య బృందం మాట్లాడుతూ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆశీస్సులు వారి కుటుంబాలకి ఎల్లవేళలా ఉండాలని దీవించారు.

