Breaking News

రెండు షాపులలో చైనీస్ మాంజా సీజ్

మన ప్రగతి న్యూస్/జహీరాబాద్

రాబోయే సంక్రాంతి పండుగలో ప్రజల భద్రత కోసం చైనీస్ మాంజా (నైలాన్, సింథటిక్, గ్లాస్ కోటింగ్) వినియోగం, విక్రయం, నిల్వ పూర్తిగా నిషేధించబడింది. ఈ విషయాన్ని డీఎస్పీ సైదా నాయక్ వెల్లడించారు.
పట్టణంలోని పలు షాప్లలో సీఐ శివలింగం మరియు ఎస్‌ఐ వినయ్ కుమార్ చేసిన తనిఖీల్లో రెండు షాపులలో నిషేధిత మాంజా దొరికినట్లు గుర్తించి, సంబంధిత షాపుల యజమానులపై కేసులు నమోదు చేశారు. అధికారులు ప్రజలకు గాలిపటాలు ఎగురవేయడానికి కేవలం సాధారణ కాటన్ థ్రెడ్ ఉపయోగించాలని స్పష్టంగా సూచించారు.
పోలీసులు ప్రజలను, ముఖ్యంగా పిల్లలను, నిషేధిత మాంజా వినియోగం నుంచి దూరంగా ఉంచి భద్రతా మార్గదర్శకాలను పాటించమని కోరారు.

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు