Breaking News

ముగ్గుల పోటీల బ్రోచర్లును విడుదల చేసిన వైరా ఏసిపి వసుంధర యాదవ్

మన ప్రగతి న్యూస్/తల్లాడ

సామాజిక సమైక్య మాధుర్యానికి ప్రతీక సంక్రాంతి అని వైరా పోలీస్ డివిజన్ ఇంచార్జ్ ఏసిపీ వసుంధర యాదవ్ అన్నారు.శనివారం వైరాలోని స్థానిక ఏసిపి కార్యాలయంలో సంక్రాంతి పండుగ సందర్భంగా తల్లాడ మండల పరిధిలోని కుర్నవల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలకు సంబంధించిన బ్రోచర్లను ఆమె విడుదల చేశారు. గ్రామంలోని బొడ్రాయి, వెంకటా చలపతి దేవస్థాన యూత్ సభ్యులు సంప్రదాయబద్ధంగా ఏసిపి నీ సన్మానించి పోటీలకు సంబంధించిన బ్రోచర్లను విడుదల చేయించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు ఐలూరు చిన్న కృష్ణారెడ్డి,ఇటుకల వెంకట చలపతి,బోజడ్ల దిలీప్, అయిలూరి వెంకటకృష్ణారెడ్డి, శ్రీ విజయలక్ష్మి,సంధ్య,లోకేష్ లు పాల్గొన్నారు.

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు