Breaking News

బాల్యమిత్రుడి వైద్య ఖర్చులకు చేయూత

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:

శంకరపట్నం మండల కేశవపట్నం గ్రామానికి చెందిన చిట్యాల రాజమల్లు ఇటీవల బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి కి ఆపరేషన్ జరిగింది. కేశవపట్నం జడ్పీహెచ్ఎస్ లో 1993-94 బ్యాచ్ బాల్యమిత్రులు రాజమల్లును పరామర్శించి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నిలిపారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ నెలవారీగా వైద్య ఖర్చులకు రూ.4 వేలు అవుతుందని తెలపడంతో బాల్యమిత్రుడు మానవతా బాల్యవిత్రులు మానవతా దృక్పథంతో రూ. 21500 చెక్ రూపంలో రాజమల్లుకు అందించారు.నూతనంగా ఎన్నికైన కేశవపట్నం ఉప సర్పంచ్ ఆకుపత్తిని విజయకుమార్ ప్రజా ప్రతినిధిగా ఎదగడంతో తమ బాల్య మిత్రుల కుటుంబాలలో కష్టసుఖాలలో ముందుంటామని హామీ ఇచ్చారు.బాల్యమిత్రులు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా బాల్యమిత్రులలో కష్టసుఖాలలో అందరం పాలుపంచుకుంటున్నామన్నారు.

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు