Breaking News

సొంతూరులోనే పోస్టింగ్

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి

ప్రభుత్వ నౌకరి ప్రతి ఒక్కరి కల అలాంటిది సాధించిన అనంతరం తాను పుట్టి పెరిగిన గ్రామంలోనే పోస్టింగ్ వస్తే దానికి మించిన ఆనందం మరొకటి ఉండదు . నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన నంగునూరు రాము ఇటీవల వైద్యశాఖ విడుదల చేసిన గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ ఫలితాల్లో స్టేట్ లెవెల్ లో34 ర్యాంక్ సాధించి జోన్ లెవెల్ లో 6ర్యాంకు జిల్లాలో 2వ ర్యాంకుసాధించాడు. ఇతనికి మంగళవారం ఉస్మానియా కాలేజీ గ్రౌండ్ లో అప్పాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాడు. నల్లబెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ గా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నారు . నల్లబెల్లిలోనే ప్రభుత్వ పాఠశాలలో చదువు కొనసాగించి నల్లబెల్లిలో మొదటి పోస్ట్ వచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేశాడు.మొట్టమొదటగా రాము ఇంతకుముందు 108 అంబులెన్స్ సర్వీస్ లో ఎంతోమందికి సేవలు అందించాడు. అనంతరం వైద్యశాఖ ఇటీవల ఫలితాల్లో విజయం సాధించడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు, తోటి మిత్రులు అభినందనలు తెలుపారు.

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు