మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి
నల్ల బెల్లి మండలం రేలకుంట గ్రామంలో గురువారం పండుగ సందర్భంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన బల్ల చంద్రమ్మ (58) ఉదయం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కాటు కు గురైంది. ఆమె పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలిస్తున్న మార్గమధ్యలోనే చంద్రమ్మ మృతి చెందినట్లు సమాచారం. ఈ సంఘటనతో పండుగ సంబరాలు ఒక్కసారిగా విషాదంగా మారింది.

