Breaking News

అమ్మో పులి

భయాందోళనలో జగదేవపూర్ మండల ప్రజలు

మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి:

ముద్రగడ పద్మనాభం మరణం పట్ల మాజీ మంత్రి పువ్వాడ సంతాపం

సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండల పరిధిలోని అంతాయాగూడెం, బిజి వెంకటాపూర్ తీగుల్, గ్రామాల్లో పులి హడలెత్తిస్తోంది. జగదేవపూర్ మండలంలోని గ్రామాలు లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు ధ్రువీకరించారు. ప్రజలు, పశువుల కాపర్లు,వెళ్లవద్దని, ఎలాంటి విద్యుత్‌ వైర్లుఅమర్చకూడదని సూచించారు. అలాగే పొలం పనులకు వెళ్లే మహిళలు గుంపులుగా వెళ్లాలని సూచించారు. కాగా ప్రాంతంలో పులి పాదముద్రలు పరిశీలించి నమూనాలను సేకరించారు. పులి సంచారంతో గ్రామాల్లో లో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.