- నల్లబెల్లి ఎస్ఐ గోవర్ధన్..
మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి:
అపరిచిత లింకులు ఓపెన్ చేయొద్దని తస్మాత్ జాగ్రత్త అని నల్లబెల్లి ఎస్ఐ గోవర్ధన్ సూచించారు.“మొదట ఇది నకిలీ అనుకున్నాను కానీ నిజంగా నాకు ₹5,000 వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి”అంటూ కొన్ని లింకులు వాట్సాప్, ఫేస్‌బుక్‌లో వైరల్ అవుతున్నాయి. కావున ఈ లింకును ఓపెన్ చేయవద్దని స్థానిక ఎస్ఐ గోవర్ధన్ తెలిపారు .ఇది పూర్తిగా అనుమానాస్ప దమైన స్కామ్ (మోసం) లింక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ లింక్ ఎందుకు ప్రమాదకరం? లింక్ చివరలో ఎక్స్ వై జెడ్ డొమైన్ ఉంది. నమ్మదగిన బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు ఇలాంటి లింకులు ఉపయోగించవు. లింక్ ఓపెన్ చేయగానే వివరాలు అడిగే అవకాశం ఉంది. మొబైల్ నెంబర్, యూపీఐ, ఓటిపి బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుని మీ ఖాతా ఖాళీ చేసే ప్రమాదం ఉందని అన్నారు. ఇలాంటి లింక్‌లతో వచ్చే ప్రమాదాలు బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు పోవడం, మరియు మొబైల్ హ్యాక్ అవడం, వ్యక్తి గత సమాచారం దుర్వినియోగమే కాకుండా.. సైబర్ నేరాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని కోరారు. డబ్బులు వచ్చాయంటూ వచ్చే లింకులను క్లిక్ చేయవద్దు. తెలియని లింకులకు ఓటిపి ,యూపీఐ పిన్ ఇవ్వరాదన్నారు.అలాంటి మెసేజ్‌లను ఇతరులకు ఫార్వర్డ్ కూడా చేయరాదని సూచించారు. సందేహం ఉంటే బ్యాంక్ లేదా సైబర్ క్రైమ్ కు సమాచారం అందించాలన్నారు. ఇప్పటికే క్లిక్ చేసి ఉంటే?
వెంటనే.. బ్యాంక్ పాస్‌వర్డ్ యూపీఐ పిన్ లను మార్చాలని తెలిపారు. వెంటనే
బ్యాంక్ కస్టమర్ కేర్ కు సమాచారం అందించాలన్నారు. అత్యవసరమైతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 కు కాల్ చేయాలని ఎస్ఐ తెలిపారు.

