Breaking News

ధాతృత్వం చాటుకున్న ఎస్ఎస్సి 97-98 బ్యాచ్

మిత్రుని కుటుంబానికి 60 వేల ఆర్థిక సహాయం.

మన ప్రగతి న్యూస్/కేసముద్రం:

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు

కేసముద్రం స్టేషన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1997-98 పదవ తరగతి చదువుకున్న మిత్రులు తమ ధాతృత్వాన్ని చాటుకున్నారు. మున్సిపల్ పరిధిలోని అమీనాపురం గ్రామానికి చెందిన శెకిడి వెంకటేశ్వర్లు బతుకుదెరువు కోసం హైదరాబాదుకు పోయి కంప్రెషర్ ట్రాక్టర్ తో రంధ్రాలు వేసే క్రమంలో గోడకూలి మృతి చెందగా, అతని కుటుంబానికి శనివారం వెంకటేశ్వర్లు చిన్ననాటి మిత్రులు వెంకటేశ్వర్లు కుటుంబానికి అండగా ఉన్నామంటూ వెంకటేశ్వర్లు భార్య రాధిక పేరు మీద చేసిన రూ.60 వేల ఫిక్స్డ్ బాండ్ ను వెంకటేశ్వర్లు భార్య రాధికకు అందజేశారు. తమ మిత్రుడు తమ నుండి దూరమైన అతని కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. పిల్లల పైచదువుల కోసం సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు మిత్ర బృందం అధ్యక్షులు శాగంటి రాములు, కార్యదర్శి గడిపల్లి వెంకన్న, కోశాధికారి గొట్టం లక్ష్మణ్, ముఖ్యలు చిలువేరు సమ్మయ్య గౌడ్, గొట్టం సతీష్, కొండబోయిన కవిత, కొండబోయిన అశోక్, కొండబోయిన వేణు, జినుకల సునీత, సుక్క మేనక, కొండవీటి అశోక్, బొల్లెద్దు చందర్, కాసు యాకయ్య, నాగేల్లి దాసు, బానోత్ బాలాజీ, పులిగిల్ల కిరణ్, బండారు వీరబ్రహ్మం, అల్లి అశోక్, ఎండి అమీర్, కంచ కట్టయ్య, పబ్బతి సారంగం, కందుకూరి ఉపేందర్, మోడెం రాజు, సదయ్య తదితరులు పాల్గొన్నారు.