మాజీ మంత్రి ఎర్రబెల్లి
తాటి కల్లు ఆరోగ్య ఔషదం
మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:
తాటికల్లు మజాగా ఉంది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో మాజీ మంత్రి దయాకర్ రావు పర్యటలో భాగంగా నర్సింగాపురం గ్రామం నుండి కొడకండ్ల కు వెళ్తుండగా మార్గం మధ్యలో నర్సింగాపురం గ్రామ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త చిత్తలూరు వెంకటయ్య తాటికల్లు తాగాలని దయాకర్ రావును కోరడంతో కార్యకర్త కోరిక మేరకు తాటికల్లు తాగారు.
ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ
తాటికల్లులో ఔషధంగా గుణాలు ఉన్నాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది అన్నారు. ఆయన వెంట మండల బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

