మన ప్రగతి న్యూస్/ వెల్దండ:
అమ్మవారికి వస్త్రాలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గ్రామీణ అభివృద్ధి,దేవాలయాల అభివృద్ధి,పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేసిందని తెలిపారు.బ్రహ్మోత్సవాల సందర్భంగా యువతలో ఉత్సాహం పెంచేందుకు నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలైన యువకులకు గోలి శ్రీనివాస్ రెడ్డి ఎడ్మ సత్యం బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో పార్టీనాయకులు,ప్రజాప్రతినిధులు కార్యకర్తలు, గ్రామ పెద్దలు,భక్తులు పెద్దసంఖ్యలోపాల్గొన్నారు.

