మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్
ఏనుకూరు మండలం లింగన్నపేట గ్రామపంచాయతీ పరిధిలోని లింగన్నపేట బ్రిడ్జి వద్ద శనివారం రాత్రి సుబాబుల్లోడు లారీ దిగబడటంతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అలుగుమూరి బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన సైడ్ రోడ్డుపై యువ బుల్లోడు మట్టి రోడ్డు ఉండటంతో లారీ అదుపు తప్పి దిగబడినట్లు స్థానికులు తెలిపారు.ఈ ఘటన కారణంగా రాకపోకలకు సుమారు గంటసేపు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని జెసిబి సాయంతో లారీని తొలగించారు. అనంతరం ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.అయితే ఈ మార్గంలో భారీ వాహనాల ప్రవేశం నిషేధించబడినప్పటికీ నిబంధనలు పట్టించుకోకుండా లారీలను అనుమతిస్తున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

