Breaking News

దుబ్బ రాజన్నను దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ విప్!

మన ప్రగతి న్యూస్/వేములవాడ

రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ మండలంలోని నాగయ్యపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ దుబ్బ రాజన్నను జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆదివారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారి ఆశీర్వచనాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిటీ ఛైర్మన్ రొండి రాజు, నాగయ్యపల్లి గ్రామ సర్పంచ్ చింతపంటి మల్లేశం, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు