సమగ్ర కుటుంబ సర్వే లో ప్రజలందరూ భాగస్వాములు అయినందుకు ప్రత్యేక ధన్యవాదాలు
ములుగు జిల్లా కలెక్టర్ ని మరియు జిల్లా,మండల,గ్రామ అధికారులను అభినందించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క
మన ప్రగతి న్యూస్/ ములుగు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే లో రాష్ట్రములోనే ములుగు జిల్లా 87.1 మొదటి స్థానం లో ఉంచినందుకు గాను జిల్లా కలెక్టర్ ని జిల్లా,మండల, గ్రామ అధికారులను సర్వే లో భాగస్వాములుగా ఉన్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క
దేశ చరిత్రలోనే అపూర్వమైన రీతిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే తెలంగాణ సమాజపు సంక్లిష్టతకు, మౌలిక సమస్యలకు అద్దం పట్టేలా ఈ సర్వే జరుగుతుంది అని సమగ్ర కుటుంబ సర్వే ఇచ్చిన వాస్తవిక అంచనాలు నూతన రాష్ట్ర ప్రభుత్వానికి దిశా నిర్దేశన చేయడమే కాదు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో కీలకమైన సూక్ష్మస్థాయి ప్రణాళికా రచనకు దోహదపడేవిగా ఉంటాయి అని నూతన రాష్ట్రంలో ప్రజలు ప్రధానంగా భూమి, నీరు, నీడ, ఉపాధుల కోసం తపిస్తున్నారని సర్వే నిగ్గు తెలుస్తుంది ఆ లక్ష్యాల సాధనకు అన్ని వర్గాలను కలుపుకొని సమష్టిగా కృషి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది
సమగ్ర కుటుంబ సర్వే లో ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు.