Breaking News

నర్సంపేట పట్టణంలో నాలుగున్నర కోట్లతో 14వ ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

టియుఎఫ్ఐడిసి నిధులు ఒక్కో వార్డుకు కోటి 60 లక్షలతో అభివృద్ధి పనులు

22 వ డివిజన్లో శంకుస్థాపన చేసిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

నర్సంపేట పట్టణంలోని 22వ డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలో అంతర్గత రోడ్లు మురికి కాలువలు కల్వర్టులు నూతన నిర్మాణం కోసం 14వ ఆర్థిక సంఘం నిధులు నాలుగున్నర కోట్ల నిధులు,టియుఎఫ్ఐడిసి నిధులు 25 కోట్లు వేచ్చించి పట్టణమంతా సుందరీకరణ చేస్తున్నామని పనులు త్వరితగతి న పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

అందరం కలసి బాధ్యతగా ఉంటేనే ప్రతీ సమస్య పరిష్కారం

గత ఐదు సంవత్సరాలలో నిధుల కోరుతతో అభివృద్ధి జరగలేదని పట్టణంలో మురికి కాలువలు,రోడ్లు శిథిలమైపోయాయని ప్రజలకు రవాణా సౌకర్యంతో పాటు మురికినీరు ఎక్కడికి అక్కడ పేరుకుపోయి పట్టణం దుర్గంధంతో మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.రాబోయే రోజుల్లో పట్టణంలో రోడ్లు గాని డ్రైనేజీలు గాని శుభ్రంగా ఉంటాయని శుద్ధి చేసిన మంచినీటిని నిత్యం ప్రజలకు అందించేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు.


ఈ సందర్భంగా 15,4, 6,8 ,9 ,18 ,19, 20,24 డివిజన్లలో శంకుస్థాపనలు చేయడం జరిగింది.వీటితోపాటు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తో ఆరవ డివిజన్లో పాఠశాల భవనానికి భూమి పూజ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుంటి రజిని,మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, కౌన్సిలర్లు,ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.