Breaking News

ముగ్గురు కాపర్ వైర్ దొంగలను పట్టుకున్న పోలీసులు

ఆంధ్రలో 18 కేసులు, దమ్మపేటలో నాలుగు కేసుల్లో నిందితులుగా ఉన్నట్టు గుర్తింపు

మన ప్రగతి న్యూస్/ దమ్మపేట :

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

మండల కేంద్రంలో ఇటీవల జరిగిన ట్రాన్స్ఫార్మర్ దొంగతనం చేసిన దొంగలను దమ్మపేట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఈ ముగ్గురు దొంగలు తాపీ పనులు చేస్తూ జీవిస్తుంటారని, వీరు జలసాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆలోచన చేసుకుని ముగ్గురు ఒక జట్టుగా ఏర్పడి ఆంధ్ర రాష్ట్రంలో 18 దొంగతనాలు చేసి జైలుకెళ్లి జైలు నుండి 2025 సంవత్సరం జనవరి నెలలో విడుదలై వచ్చి మళ్లీ దొంగతనాలు చేయాలని నిశ్చయించుకుని ఆంధ్ర రాష్ట్రం సరిహద్దులో ఉన్న తెలంగాణ రాష్ట్రంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దొంగతనాలు చేయాలని వచ్చి దమ్మపేట నుండి అచ్యుతాపురం వెళ్లే రోడ్డులో రోడ్డు పక్కనే ఉన్న తోటలలో నాలుగు ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి కాపరు వైరును ఎత్తుకెళ్లటం జరిగింది. ఈ సంఘటనను పురస్కరించుకొని దమ్మపేట విద్యుత్ శాఖ ఏఈ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శనివారం ఉదయం అచ్యుతాపురం రోడ్డులో దమ్మపేట పోలీస్ ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది లక్ష్మణ్, రామకృష్ణారెడ్డి, కాలేష వలి, నాగ ముత్యం, రమేష్ లు వాహనాల తనిఖీ చేస్తుండగా మారుతి కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులపై అనుమానం వచ్చి కారును శోధించగా కారు డిక్కీలో వున్న కాపరువైరును చూసి అదుపులోనికి తీసుకొని స్టేషన్ కి తీసుకువచ్చి ఇది ఎక్కడ దొంగతనం చేశారని ప్రశ్నించగా ములకలపల్లి, కరకగూడెం, ఏడూర్ల బయ్యారం మండలాలలో పలు దొంగతనాలు చేశామని, ఇటీవల దమ్మపేటలో ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి కాపర్ వైర్ ను దొంగిలించినప్పుడు తీసుకెళ్లకుండా చెట్లపొదల్లో పడవేసి, ఇప్పుడు మళ్లీ వచ్చి వాటిని కారు డిక్కీలో వేసుకొని వెళ్తూ పోలీసులకి దొరికారని, 2025 సంవత్సరం అక్టోబర్ నెల నుండి దొంగతనాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుండి దొంగతనానికి ఉపయోగించిన వైరును కట్ చేయడానికి ఉపయోగించే కట్టర్, ఐదు రెంచిలు, ఒక గడ్డ పలుగు, మూడు సెల్ ఫోన్లు, ఒక మారుతి సుజుకి కారును, 90 కేజీల కాపరు వైర్ ను స్వాధీనపరుచుకున్నారు. ఈ ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు పడేవిధంగా కేసులు పెడతామని, ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. దమ్మపేట పోలీస్ స్టేషన్లో శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఎంతో చాకచక్యంగా, ఇంత త్వరగా కేసును పరిష్కరించిన దమ్మపేట పోలీస్ ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డిని, రామకృష్ణారెడ్డిని, లక్ష్మణ్ ని ఎస్పీ రోహిత్ రాజ్, డి.ఎస్.పి సతీష్ కుమార్, అశ్వరావుపేట సీఐ నాగరాజు అభినందించారు.