Breaking News

బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో ‘తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం’

-సామాజిక సమానత్వం ద్వారా,అన్ని వర్గాలతోనే మన దేశం అభివృద్ధి చెందుతుంది.

-జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా స్థాపర్:

హుజూర్నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మూడో వార్డు కౌన్సిలర్ ఏకీగ్రీవంగా ఎన్నిక

సామాజిక సమానత్వం ద్వారానే అన్ని వర్గాలు, తద్వారా దేశం అభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.భగత్ నగర్ లోని ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో ‘తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం’నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేల సత్పతి మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. దివ్యాంగులు,నిరుపేదలందరికీ సమాన అవకాశాలు కల్పించాలని,వృద్ధులకు న్యాయం,సేవా అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు.అందరూ ఐక్యంగా ఉంటూ ఒకరికి ఒకరు సహకరించుకుంటూ సమాజాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.విద్యార్థులు గొప్ప ఆశయంతో ముందుకు వెళ్లాలని,ముఖ్యంగా బాలికలు ఉన్నత విద్య అభ్యసించి ఉపాధి అవకాశాలతో ఆర్థిక సాధికారత సాధించాలని తెలిపారు.జిల్లా రెవిన్యూ అధికారి బి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్ని వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు.కార్యక్రమంలో భాగంగా వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. సామాజిక న్యాయ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు.అనంతరం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వసతి గృహాన్ని సందర్శించారు.హాస్టల్లో విద్యార్థుల కోసం అమర్చిన గీజర్,పలు సౌకర్యాలు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్,వసతి గృహ సంక్షేమ అధికారి శ్రీదేవి మరియు తదితరులు పాల్గొన్నారు.