Breaking News

రాజన్న పేరుతో దోపిడీ… వేములవాడను అభివృద్ధి లేని పట్టణంగా మార్చారు

:కేంద్రమంత్రి బండి సంజయ్

మన ప్రగతి న్యూస్/వేములవాడ

హుజూర్నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మూడో వార్డు కౌన్సిలర్ ఏకీగ్రీవంగా ఎన్నిక

రాజన్న ఆలయ అభివృద్ధి పేరు చెప్పి వేములవాడ మున్సిపల్ పరిధిలోని మిగతా ప్రాంతాల అభివృద్ధిని పూర్తిగా తుంగలో తొక్కేశారని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. తిప్పాపూర్, అంజనీ నగర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని బీఆర్ఎస్ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.బీఆర్ఎస్ పాలన ప్రజల రక్తాన్ని పీల్చే పాలనగా మారిందని విమర్శించిన ఆయన, రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి ఇప్పుడు అభివృద్ధి పనులకు ఒక్క రూపాయి కూడా లేని దుస్థితికి తీసుకువచ్చారని ఆరోపించారు. రాజన్న ఆలయం చుట్టూ మాత్రమే పనులు చూపించి, వార్డులు–కాలనీలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే వేములవాడలో నిజమైన అభివృద్ధి ఏంటో చూపిస్తామని, ప్రజల పన్నుల సొమ్మును ప్రజల కోసమే వినియోగిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.