Breaking News

వైరా, మధిర మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారంలో నామ నాగేశ్వరరావు

మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్:

బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్షనేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి వైరా మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు మాజీ జడ్పీ చైర్మన్, మధిర అసెంబ్లీ ఇంచార్జ్ లింగాల కమల్ రాజ్‌తో కలిసి మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి 5, 6, 7 వార్డుల్లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

హుజూర్నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మూడో వార్డు కౌన్సిలర్ ఏకీగ్రీవంగా ఎన్నిక