_ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే ధ్యేయం
మన ప్రగతి న్యూస్/గజ్వెల్ డివిజన్ ప్రతినిధి:
గజ్వెల్ లో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గజ్వేల్ పట్టణంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు మరియు ఓటర్లలో ధైర్యాన్ని నింపేందుకు పోలీసులు భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.గజ్వేల్ ఏసిపి నర్సింలు నేతృత్వంలో జరిగిన ఈ కవాతు పట్టణంలోని ప్రధాన కూడళ్ల గుండా సాగింది.
ఈ ఫ్లాగ్ మార్చ్ స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమై,మెయిన్ రోడ్డు,పల్లెపాడు వేములగట్టు ఆర్ అండ్ ఆర్ కాలనీ మీదుగా కొనసాగింది.ఈ కవాతులో సివిల్ పోలీసులు,రిజర్వ్ పోలీస్ బలగాలు సాయుధ దళాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని,ప్రజలు భయం లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏసిపి నర్సింలు ఈ సందర్భంగా సూచించారు.ఎన్నికల నిబంధనలను అతిక్రమించే వారిపై, ఓటర్లను ప్రలోభపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గజ్వేల్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ హెచ్చరించారు.పట్టణంలో ఇప్పటికే నిఘాను పెంచామని,ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి గజ్వేల్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ తెలియజేశారు.ఈ కార్యక్రమం లో గజ్వేల్ ఏసిపి నర్సింలు, ట్రైనీ ఐపిఎస్ అయేషా ఫాతిమా ఇన్స్పెక్టర్లు లతీఫ్ , ముత్యం రాజు ఎస్ ఐ లు గజ్వేల్ డివిజన్ పోలీస్ బృందం పాల్గొన్నారు.

