Breaking News

ఓటాయి లో మేడారం తిరుగు వారం జాతర ప్రారంభం

మనప్రగతి న్యూస్ /కొత్తగూడ
ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర ముగిసిన అనంతరం కొత్తగూడ మండలం ఓటాయిలో గంటరెండు దశబ్దాలుగా పుట్టల మేడారం పేరిట తిరుగువారం జాతరను నిర్వహిస్తూ వస్తున్నారు, ఈ క్రమం లోనే ఓటాయి గ్రామంలోని సమ్మక్క సాలమ్మ గుడి వద్ద బుధవారం వనం ను ఆదివాసి సాంప్రదాయాలతో డోలి వాయిద్యా లతో శివసత్తుల పునకాల నడుమ ఆదివాసి వడ్డెలు పెద్దలు ప్రతష్టించి జాతరకు అంకురార్పణ చేశారు. ఈ సందర్బం గా గ్రామ సర్పంచ్ గట్టి రాములు సారలమ్మ పూజారి ధనుసరి శ్రీరాములు, గ్రామ పెద్దలు బుగ్గల కొమరయ్య, ఈక ప్రభాకర్ తదితరులు మాట్లాడుతూ గత రెండు దశబ్దాలు గా ఓటాయి గ్రామం లో తిరుగు వారం జాతరను నిర్వహిస్తూన్నామని, రవాణా సౌకర్యాలు అంతగా లేని రోజుల్లో గూడూరు మహబూబాబాద్ తదితర ప్రాంతాలనుంచి ఎడ్ల బళ్ళ పై మేడారం జాతరకు ఓటాయి గ్రామం మీదుగా రాకపోకలు సాగించే వారని, ప్రస్తుతం గుడి వున్నప్రదేశం లో భక్తులు విడిది చేసేవారని ఈ క్రమం లో తమ గ్రామ పెద్ద ధనుసరి ఎర్రయ్యకు సమ్మక్క కలలో కనపడి తాను ఓటాయి సమీపంలో తన భక్తులు విడిది చేసే స్థలం వద్ద పుట్ట రూపం లో వెలుస్తున్నానని తనను నమ్మికొలిచిన వారి కోరికలు తీరుస్తానని 1మేడారం జాతర ముగిసిన అనంతరం తిరుగువారం జాతర ను జరిపించాలని అజ్ఞాపించిందని తమ గ్రామ పెద్ద తమకు తెలుపడం తో తాము క్రమం తప్పకుండా తిరుగు వారం జాతరను తమ స్వంత డబ్బులతో శక్తి మేర ఘనం గా నిర్వహిస్తూ వస్తున్నామని వారు తేలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ జాతర బుధవారం ఉదయం వన ప్రతిష్టాపన తో మొదలయ్యి అదేరోజు సాయంత్రం సారాలమ్మ ను, గురువారం సాయంత్రం సమ్మక్క ను ఓటాయి గ్రామ సమీపంలోని అడవి లోని గుట్ట నుంచి తీసుకు వచ్చి ప్రతిష్టించి శుక్రవారం భక్తులు తమ మొక్కులు చెల్లించిన అనంతరం అదేనా రోజు సాయంత్రం తల్లులను వన ప్రవేశం చేయించడం తో జాతర ముగుస్తుందని వారు తెలిపారు. ఈ జాతర లో సారలమ్మ పూజారిగా ధనుసరి శ్రీరాములు నాగులమ్మ పూజారిగా తుర్స నారాయణ సమ్మక్క పూజారిగా సిద్దబోయిన ఎల్లయ్య ధనుసరి విజయలక్ష్మి ఈక సారమ్మ, తగిడి సరిత లు వ్యవహారిస్తారని గ్రామ సర్పంచ్ గట్టి రాములు పెద్దలు బుగ్గల కొమురయ్య ఈక ప్రభాకర్ ధనుసరి సారయ్య వసంతరావు భాస్కర్ సారంగపాణి బద్దుల నరసయ్య రాములు సురేశ్ తదితరులు తేలిపారు.

బైక్ స్కిడ్ అయి యువకుడికి తీవ్ర గాయాలు