Breaking News

బస్టాండ్ రూపురేకలు మార్చింది బిఆరెస్

అండర్ డ్రైనేజి నిర్మించింది మనమే

అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్

కెసిఆర్ ఉన్నప్పుడు రాష్టం పచ్చబడింది

కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది

ఒక్కొక్కరికి 60 వేలు బాకీ పడ్డ కాంగ్రెస్

హుజూర్నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మూడో వార్డు కౌన్సిలర్ ఏకీగ్రీవంగా ఎన్నిక

కొత్తకోటలో బిఆరెస్ ప్రచారంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల

మన ప్రగతి న్యూస్ / వనపర్తి ప్రతినిధి :

కొత్తకోట మున్సిపాలిటీలో ఉన్న బస్టాండ్ ను రూపురేకలు మార్చింది బిఆరెస్ ప్రభుత్వమే అని, అంతకుముందు బస్టాండ్ లో వర్షం వస్తే బురదమయంగా ఉండేది అందులో ప్రతిపక్ష నాయకులు నాట్లు వేసే కార్యక్రమాలు చేసేవారు అలాంటి బస్టాండ్ ను బిఆరెస్ ప్రభుత్వం చక్కదిద్దిందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బిఆరెస్ ప్రచారంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మున్సిపల్ ఎన్నికల బిఆరెస్ ఇంచార్జ్ అభిలాష్ రావు తో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని తెలిపారు. కొత్తకోట మున్సిపాలిటీలో అండర్ డ్రైనేజి వ్యవస్థను ఏర్పాటు చేసిందని మనమే అని అన్నారు. కొత్తకోట మున్సిపాలిటీలో అభివృద్ధి జరిగింది అంటే అది బిఆరెస్ ప్రభుత్వం వల్లే జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ వచ్చింది తెలంగాణ రాష్టానికి కరువు వచ్చిందని తెలిపారు. కురుమూర్తి స్వామి మీద ఒట్టు వేసి రైతు రుణమాఫీ చేస్తానని అని మాట తప్పిండు రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. దేవుండ్ల మీద ఒట్లు కెసిఆర్ మీద తిట్లు అనేది పనిగా పెట్టుకున్నాడని ప్రజాపాలన గాలికి వదిలేసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలని మున్సిపల్ ప్రజలకు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో 15 వార్డులో బిఆరెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. వచ్చేది మళ్ళీ బిఆరెస్ ప్రభుత్వమే అని చెప్పారు. కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, రైతురుణమాఫీ కాలేదు, 4 వేల పింఛన్లు లేవు, రైతులకు ఎరువుల కొరత, చదువుకుంటున్న మహిళలకు స్కూటీలు, 2500 రూపాయలు ఇవ్వలేదు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందని గుర్తు చేస్తూ దీనిని బాగా ప్రజలోకి తీసుకువెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.