మన ప్రగతి న్యూస్ / వర్ధన్నపేట : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల వ్యయంపై మున్సిపల్ కమిషనర్ సుధీర్ బాబు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఖర్చుల పరిమితులు, వ్యయాల నమోదు విధానం, రిజిస్టర్ల నిర్వహణపై అధికారులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులకు వివరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే తీసుకునే చర్యలను కూడా స్పష్టం చేశారు. అభ్యర్థులు పారదర్శకంగా ఖర్చులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట తహసిల్దార్ విజయ సాగర్, ఎంపీడీవో వెంకటరమణ, ఎస్సై సాయిబాబా, సంబంధిత ఎన్నికల నిర్వహణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

