ఎస్పీ నరసింహ ఐపిఎస్
మన ప్రగతి న్యూస్/
సూర్యాపేట జిల్లా స్టాపర్
పోలీస్ వాహనాల డ్రైవర్ లుగా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి సఫారి యూనిఫాం అందించిన ఎస్పీ పోలీస్ శాఖ నందు పోలీసు వాహనాలు నడుపుతూ డ్రైవర్లుగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందికి జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఎస్పీ సఫారీ యూనిఫామ్స్ అందించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు వాహనాలను మంచి కండిషన్ లో ఉంచాలని వాహనాల నాణ్యత వచ్చేలా నిర్వహణ చేయాలని సూచించారు. పౌరులకు పోలీసు సేవలు అందించడంలో పోలీసు వాళ్ల సంఘటన స్థలాలకు, బాధితుల వద్దకు చేర్చడంలో వాహనాలు, డ్రైవర్ సిబ్బంది కీలక విధులు నిర్వర్తిస్తున్నారు అని తెలిపారు. సిబ్బంది క్రమశిక్షణ సమయపాలనతో పని చేయాలని, వాహనాలు ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు రక్షణ చర్యలు పాటించాలని కోరారు. పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు నారాయణరాజు, ప్రవీణ్ కుమార్, పోలీస్ మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆర్ఎస్ఐ సురేష్, పోలీస్ సంక్షేమ ఆర్ఎస్ఐ సాయిరాం, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

