Breaking News

వేములవాడలో లాడ్జీల అద్దెలకు ఫిక్స్డ్ రేట్లు– మున్సిపాలిటీ ఉత్తర్వులు

మన ప్రగతి న్యూస్/వేములవాడ

వేములవాడ పట్టణంలోని ప్రైవేటు లాడ్జీలు, వసతి గదుల్లో ఇష్టారాజ్యంగా అద్దెలు వసూలు చేయకుండా మున్సిపాలిటీ అధికారులు ఫిక్స్డ్ అద్దె రేట్లను నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నాన్ ఏసీ గదికి రూ.300, సింగిల్ ఏసీ గదికి రూ.600, సింగిల్ బెడ్‌రూమ్ డీలక్స్ నాన్ ఏసీకి రూ.500, సింగిల్ బెడ్‌రూమ్ డీలక్స్ ఏసీకి రూ.1,200గా నిర్ణయించారు. అలాగే డబుల్ బెడ్‌రూమ్ డీలక్స్ నాన్ ఏసీకి రూ.1,000, డబుల్ బెడ్‌రూమ్ డీలక్స్ ఏసీకి రూ.1,500 అద్దెగా ఖరారు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఈ నిర్ణయంతో అద్దెల్లో పారదర్శకత పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

కాప్రాలో గంజాయి విక్రేతల అరెస్టు