- ఆర్టీసీ బస్సు కింద పడి డెలివరీ బాయ్ మృతి..
మన ప్రగతి న్యూస్/ఉప్పల్, మేడ్చల్ జిల్లా స్టాపర్ :
అతివేగం ఒక నిండు ప్రాణాన్ని బలితీసు కుంది. విధులు ముగించుకుని వెళ్తున్నా డో లేక విధులకు వెళ్తున్నాడో కానీ, ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం ఒక పేద కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఉప్పల్ ప్రధా న రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువ డెలివరీ బాయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం రూప్ల తండాకు చెందిన ధరావత్ మహేష్ (22), గత ఏడాది కాలంగా నగరంలో బ్లింకిట్ మరియు ఫ్లిప్‌కార్ట్ సంస్థల్లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని ఆదుకుంటున్నా డు. శుక్రవారం ఉదయం 8:30 గంటల సమయంలో మహేష్ తన బైక్ (టీజీ 26ఎ 5282) పై ఉప్పల్ నుండి బోడుప్ప ల్ వైపు వెళ్తున్నాడు. అనూ ఫర్నిచర్ సమీపంలోకి రాగానే, చెంగిచర్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ 21 జడ్ 03 81) డ్రైవర్ అతివేగంగా వచ్చి మహేష్ బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మహే ష్ కుడివైపు పడిపోగా..బస్సు ఎడమ వెనుక చక్రం అతని తలపై నుండి వెళ్లడం తో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ప్రమాద సమాచారం అందు కున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చేతికి అందిన కొడుకు కళ్ల ముందే విగతజీవిగా పడి ఉండటం చూసి తండ్రి ధరావత్ బద్రు కన్నీరు మున్నీరవుతున్నారు. బాధ్యతా రాహిత్యంగా బస్సు నడిపిన డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

