Breaking News

నేడు ఇసుక,మట్టి బహిరంగ వేలం

-తాహశీల్దార్ సురేఖ.

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:

సాగర్ కెనాల్ జలాల మళ్లింపుపై గార్లఒడ్డు చెరువును పరిశీలించిన వైరాఎమ్మెల్యే రాందాస్ నాయక్

శంకరపట్నం మండలంలో అక్రమంగా తరలిస్తున్న 3 టిప్పర్ల లోని మట్టిని, 9 ట్రాక్టర్ల లోని ఇసుకను పోలీసులు పట్టుకుని తహసీల్దార్ కి బైండోవర్ చేసారు.యజమానులపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా హుజురాబాద్ అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేటివ్ ఆదేశాల మేరకు శంకరపట్నం తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం(నేడు) మధ్యాహ్నం 12 గంటలకు బహిరంగ వేలం వేస్తున్నట్లు తాహశీల్దార్ సురేఖ తెలిపారు.ఆసక్తి గలవారు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని మండల ప్రజలను కోరారు.