- అలియాబాద్‌లో మద్యం సీజ్..
మన ప్రగతి న్యూస్ / మేడ్చల్ జిల్లా స్టాపర్ :
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలను ముమ్మరం చేశాయి. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్‌గాడి మలక్‌పేట్‌లో శుక్రవారం భారీగా మద్యం పట్టుబడింది. వివరాల్లోకి వెళ్తే.. వచ్చే మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల కోడ్ అమలులో భాగంగా అలియాబాద్ ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో లాల్‌గాడి మలక్‌పేట్‌కు చెందిన ఎ. అరవింద్ రెడ్డి, తండ్రి: దామోదర్ రెడ్డి, ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 6.75 లీటర్ల మద్యంను అధికారులు గుర్తించి సీజ్ చేశారు. అనంతరం పట్టుబడిన మద్యాన్ని తదుపరి చర్యల నిమిత్తం జీనో వ్యాలీ పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.

