Breaking News

కాప్రాలో గంజాయి విక్రేతల అరెస్టు

మన ప్రగతి న్యూస్ /కాప్రా, మేడ్చల్ జిల్లా స్టాపర్ :

కాప్రా ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను ఎస్టీఎఫ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్టీఎఫ్‌ బీ-టీమ్‌ ఎస్సైలు నాగరాజు, జ్యోతి తమ సిబ్బందితో కలిసి శుక్రవారం నేతాజీనగర్‌, వంపుగూడ ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.. నేతాజీనగర్‌లో గంజాయి విక్రయిస్తున్న మంద రాహుల్‌ వద్ద 131 గ్రాములు, వంపుగూడలో మరో 234 గ్రాముల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసుల్లో మంద రాహుల్‌తో పాటు విశ్వనాథ్‌, మనోజ్‌, తనీష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మహారాష్ట్రతో పాటు నగరంలోని ధూళిపేట నుంచి గంజాయిని తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. వీరి నుంచి మూడు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని, తదుపరి చర్యల నిమిత్తం నిందితులను కాప్రా ఎక్సైజ్‌ పోలీసులకు అప్పగించినట్లు ఎస్టీఎఫ్‌ అధికారులు వెల్లడించారు.

ఎన్నికల తనిఖీలు: