- తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల వేడుకోలు..
మన ప్రగతి న్యూస్/నడికూడ:
నడికూడ మండలం చర్లపల్లి గ్రామంలోని అంగన్వాడి మూడవ సెంటర్ టీచర్ శీలం సరిత, నాలు గవ సెంటర్ మంజుల లు విధులు నిర్వర్తిస్తున్నారు. మూడవ సెంటర్ లో పది మంది పిల్లలు ఉండగా.. ఒకరు కూడా హాజరు కాలేదు. నాలుగవ సెంటర్ లో ఎనిమిది మంది పిల్లలు ఉండగా ఇద్దరు పిల్లలు హాజరయ్యారు. స్థానికుల సమాచారం మేరకు.. అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ లు సమయ పాలన పాటించడం లేదని వెల్లడిం చారు. సమయం ప్రకారం సెంటర్ లు తీయకపోవడంతో పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిందని పలువురు ఆరోపిస్తున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు నిలదీయ గా .. మీరు ఏం చేసుకుంటారో చేస్కోండి. అని దుర్భాషలాడు తున్నారని తెలిపారు. పిల్లలకు అందించే పోషకాహారంలో లోపాలు ఉండడంతో అనారోగ్యం పాలవు తున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆహారం విష యంలో నాణ్యత, పరిశుభ్రత పాటించి, పిల్లల ఆరోగ్యంపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ స్తులు కోరుతున్నారు. అంగన్వాడి భవనం పరిసరాలు కూడా అపరి శుభ్రంగా ఉండి, పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో పిల్లల ఆరోగ్యం పై తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. అంగన్వాడి టీచర్ల పై తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
అంగన్వాడి సూపర్వైజర్ కే. శ్రీదేవి ని వివరణ కోరగా.. అంగన్వాడిలో సమయ పాలన పాటించాలని, మెనూ ప్రకారం పిల్లలకు పోషకాహారాలు అందించాలని తెలిపినట్లు చెప్పారు. గతంలో కూడా ఇలాంటి సందర్భాలు ఉన్నాయని, వారిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.



