Breaking News

వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్మన ప్రగతి న్యూస్ / వర్ధన్నపేట : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు వర్ధన్నపేట ఏసిపి అంబటి నరసయ్య ఆధ్వర్యంలో శనివారం రోజున వర్ధన్నపేట మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో పోలీసులు ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ ఉమ్మడి నరసయ్య మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ప్లాగ్ మార్చ్ నిర్వహించామని తెలిపారు. పట్టణ ప్రజలు శాంతిభద్రతలకు విఘాతం కలుగ చెయ్యకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించే లాగా సహకరించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎస్ఐలు సాయిబాబా, రాజు, జఫర్గడ్ ఎస్సై రామారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

కరీంనగర్ 30వ డివిజన్ అభివృద్దే నా లక్ష్యం

-కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ అభ్యర్థి కల్లెపల్లి శారద బాలరాజు

మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా స్థాపర్:

దేశవ్యాప్త సమ్మెకు ఎంపీడీవో కు జిపి సిబ్బంది వినతి

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 30వ డివిజన్ నుండి కల్లెపల్లి శారద బాలరాజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. కార్పొరేటర్ అభ్యర్థి కల్లె పల్లి శారద బాలరాజు మాట్లాడుతూ నేను చిన్ననాటి నుంచే డివిజన్లో నివసిస్తున్నాను.ఇక్కడ ప్రతి వీధి అనుభవంతో నాకు తెలుసు.అందుకే మాటలకే కాదు,పనిచేసే నాయకత్వానికి నేను కట్టుబడి ఉన్నాను. కార్పొరేటర్ గా ఎన్నికైతే, ప్రభుత్వం సహకారంతో మన డివిజన్ ను అన్ని డివిజన్లకు ఆదర్శంగా తీర్చిదిద్దడమే నా ప్రధాన లక్ష్యం.
-నా ప్రధాన హామీలు:
నా 30వ డివిజన్ అర్హులైన ప్రతి పేదింటి ఆడబిడ్డకు వివాహ సమయంలో నా వంతు 50 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తాను. గాంధీ చౌరస్తా వద్ద ముత్యాల పోచమ్మ గుడి అభివృద్ధి చేపిస్తాను.అరుంధతి నగర్, హనుమాన్ టెంపుల్ అభివృద్ధి చేయుట,అరుంధతి నగర్ లో కమిటీ హాల్ ఏర్పాటు చేయుట మరియు అరుంధతి నగర్ లో స్వాగత తోరణం కమాన్ నిర్మిస్తాను.డివిజన్లో ప్రజాపాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు అన్ని రకాల పెన్షన్లు,మరియు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,గృహ జ్యోతి రాని వారికి కొత్తగా ఇప్పిస్తాను.ప్రతి వీధిలో డ్రైనేజీ సమస్యలు మరియు ప్రతి ఇంటికి నీటి సదుపాయము,ఎలాంటి ఆటంకం లేకుండా అందరికీ నీటి సౌకర్యం అందించేలా కృషి చేస్తాను.మన డివిజన్ పేదింటి ప్రజలకు నన్ను కార్పొరేటర్ గా గెలిపిస్తే నాకు వచ్చే జీతం పేదింటి గడపలకు అప్పగిస్తాను. డివిజన్లోని అర్హులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల ఫండ్ ద్వారా కుటుంబానికి చేయూత.డివిజన్లో ప్రతి వారం దోమల నియంత్రణ కొరకు ఫంగింగ్ చేయించుట. మన డివిజన్ అంబేద్కర్ క్లబ్, ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేపిస్తాను.నా డివిజన్ ప్రజలకు ప్రసూతి కానులకు ఆడబిడ్డకు జన్మించిన వారికి నా వంతు ఆర్థిక సహాయము అందిస్తాను.కుటుంబంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి 1 రూపాయి స్కీంతో పాటు అండగా నిలవడం నా వంతుగా రూపాయలు 10,000 రూపాయలు ఇస్తాను. డివిజన్లో ప్రజలకు గతంలో నిర్మించబడిన ఇండ్లకు పర్మిషన్ లేని ఇండ్లకు పర్మిషన్లు ఇప్పిస్తాను. డివిజన్లోని మహిళా సంఘాల సమావేశములకు భవనం ఏర్పాటుకు కృషి చేస్తాను. ప్రతి ఇంటికి లేబర్ కార్డు అందిస్తాను.ఎల్లప్పుడూ డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉండి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను.డివిజన్ ప్రజలు తమ అమూల్యమైన ఓటును 30 డివిజన్ కార్పొరేటర్ కల్లె పల్లి శారద బాలరాజ్ కు ఓటు వేసి అధిక మెజారిటీతో 30వ డివిజన్ కార్పొరేటర్ గా గెలిపించగలరని డివిజన్ ప్రజలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.