Breaking News

మన ప్రగతి ఎఫెక్ట్..

సమయ పాలన పాటిస్తూ, విధులు నిర్వర్తించాలి..

మన ప్రగతి న్యూస్/నడికూడ:

మండలంలోని చర్లపల్లి అంగన్వా డి కేంద్రాలపై మన ప్రగతి దినపత్రికలో శనివారం ‘ సమయ పాలన పాటించని అంగన్వాడీలు ‘అనే శీర్షిక ప్రచురితం కాగా .. సోమవారం అంగన్వాడి సూపర్వైజర్ కే. శ్రీదేవి చర్లపల్లి గ్రామంలోని మూడు, నాలుగు అంగన్వాడి కేంద్రాలను పరిశీలించారు. అనంతరం అంగన్వాడీ టీచర్స్ పై విచారణ చేపట్టారు. సమయపాలన పాటించాలని, విధి నిర్వహణలో బయటికి వెళ్లకుండా విధులు నిర్వర్తించాలని.. ఒకవేళ అత్యవస రమైనప్పుడు పై అధికారుల అనుమతి తీసుకోవడం తప్పనిసరి, ఈ ఘటన పునారావృతం కాకుండా చూసుకోవాలని మందలించారు. మరొకసారి ఇలా జరిగితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. ఈ పరిశీల నలో సర్పంచ్ గా ఎన్నికై రెండు నెలలు కాక ముందే మహిళలకు కల్పిస్తున్న హక్కులను కాలరాస్తూ.. మహిళా సర్పంచ్ బండి రేణుక స్థానంలో.. సతికి బదులుగా పతి హాజరు కావడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. మహిళ లకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న.. వారి పతుల పెత్తనం ఏంటని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.

శ్రీ చైతన్య మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా ముగ్గుల పోటీలు..

ఇలాంటి ఘటనలు స్థానిక ఎమ్మెల్యే, మరియు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని మహిళల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.