Breaking News

ఎన్నికల సమరానికి సిద్ధం

•నేడే పోలింగ్ ఉత్కంఠకు తెరపడనుంది.

•పోలింగ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్.

•ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలి.

•కేసముద్రం సీఐ సత్యనారాయణ.

శ్రీ చైతన్య మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా ముగ్గుల పోటీలు..

మన ప్రగతి న్యూస్/కేసముద్రం:

కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికల సమయం రానే వచ్చింది నేడు జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలకు ముస్తాబైన మున్సిపాలిటీలోని పలు పాఠశాలలు నూతనంగా ఏర్పడిన కేసముద్ర మున్సిపాలిటీలో తొలుత మున్సిపాలిటీ ఎన్నికలకు ప్రజలు ఉత్సాహం కనబరుస్తున్నారు. కేసముద్ర మున్సిపాలిటీలోని 16 వార్డులకు గాను స్టేషన్ హైస్కూల్లో ఆరువార్డుల6 సెంటర్లకు గాను 10 బూతులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విలేజ్ హై స్కూల్ లో3 సెంటర్లకు 8 బూతులు గ్రామపంచాయతీలో రెండు సెంటర్లకు, అమీనాపురం 4 , సబ్ స్టేషన్ 2,ఉప్పరపల్లి క్రాస్ రోడ్ ఎంపీపీ ఎస్ లో3, ధనసరి 4,సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. నేడు జరగబోయే ఎన్నికలను ప్రశాంతంగా జరిగేలా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పోలింగ్ సెంటర్ల వద్ద 100 మీటర్స్ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీస్ శాఖ తెలిపింది.పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎన్నికల నిర్వహించే అధికారులు బ్యాలెట్ బాక్స్ లతో పోలింగ్ సెంటర్లకు చేరుకోవడం జరిగింది.