Breaking News

కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే గ్రామాలకు మహర్దశ

-బిజెపి మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్.

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:

శ్రీ చైతన్య మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా ముగ్గుల పోటీలు..

శంకరపట్నం మండలం కేశవపట్నం నుండి పాపయ్య పల్లె వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి బిజెపి మండల అధ్యక్షుడు, కేశవపట్నం ఎంపీటీసీ-2 ఏనుగుల అనిల్ బిజెపి నాయకులతో కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు 3 నెలల క్రితం వినతి పత్రం అందించారు.అనిల్ నిరంతర కృషి ఫలించింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంతో బీటీ రోడ్డు మంజూరు చేయడంతో సంజయ్ చొరవతో మంగళవారం సంబంధిత శాఖ అధికారులు రోడ్డు నిర్మాణానికి సంబంధించిన అంచనాలను,స్థల పరిశీలన నిర్వహించారు.ఏనుగుల అనిల్ స్థానికంగా ప్రజల కోసం నిరంతరంగా పోరాడడంతోనే బీటీ రోడ్డు కార్యరూపం దాల్చడంతో గ్రామ ప్రజల్లో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. బీటీ రోడ్డు మంజూరు కావడంతో రవాణా సౌకర్యం,విద్య,వైద్య రోడ్డు దోహదపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో గ్రామాలకు మహార్దశ రావడానికి నిదర్శనమని బిజెపి మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ అన్నారు.గ్రామ అభివృద్ధికి తోడ్పడు పడిన కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోంశాఖ సహాయ హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి గ్రామ ప్రజలు,బిజెపి నాయకులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.