మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:
శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన గాజుల మహేష్ స్వల్ప మెజారిటీతో ఓడిపోయాడు.గ్రామంలో ఆడపిల్ల జన్మిస్తే రూ.5వేలు,ఎవరైనా మరణిస్తే రూ.10వేలు ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు.స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన మహేష్ మానవతా దృక్పథంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో గ్రామ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నాడు.ఇటీవల దాసారపు తిరుపతి దంపతులకు ఆడపిల్ల జన్మనివ్వగా రూ.5వేలు,కాసర్ల సమ్మయ్య అనారోగ్యంతో మృతిచెందగా రూ.10వేలు అందజేసి గ్రామ ప్రజల ప్రశంసలు పొందారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దండు రాజేష్,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నేరెళ్ల సంతోష్,ఉపాధ్యక్షుడు కల్లూరి సంతోష్,వార్డ్ మెంబర్ చిట్ల శ్రీరాములు,సీనియర్ కార్యకర్తలు గాజుల శ్రీనివాస్,పెంట సాంబయ్య, తుమ్మ వెంకటపతి,రాయిని రమేష్,చీకట్ల శ్రీనివాస్,గాజుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

