Breaking News

గోగికార్ శివకుమార్ జన్మదిన సందర్భంగా కాప్రా డివిజన్‌లో విస్తృత సేవా కార్యక్రమాలు

  • వందల మందికి చీరల పంపిణీ
    ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు – శివకుమార్

మన ప్రగతి న్యూస్ / కాప్రా, మేడ్చల్ జిల్లా స్టాపర్ :

కాప్రా డివిజన్‌కు చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు, ప్రజాసేవలో ఎప్పుడూ ముందుండే గోగికార్ శివకుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని కాప్రా డివిజన్ పరిధిలో విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలతో జన్మదినాన్ని జరుపుకోవడం ఆయన ప్రత్యేకతగా నిలుస్తోందని స్థానికులు ప్రశంసించారు. ఈ సందర్భంగా గాంధీనగర్ ప్రాంతంలో 300 మందికి, కాప్రా ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో 400 మందికి, అలాగే వంపుగూడ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో 300 మందికి చీరల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. మొత్తం వెయ్యి మందికి పైగా పేద, నిరుపేద కుటుంబాలకు చీరలు అందజేయడంతో కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ సేవా కార్యక్రమాలు క్రమబద్ధంగా, శాంతియుతంగా జరిగాయి. చీరలు అందుకున్న మహిళలు గోగికార్ శివకుమార్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రజల కష్టాలను గుర్తించి, అవసర సమయంలో అండగా నిలిచే నాయకుడు శివకుమార్ అని వారు పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, స్టేట్ డైనమిక్ లీడర్ సోమశేఖర్ రెడ్డి, కాప్రా డివిజన్ అధ్యక్షుడు నవీన్ గౌడ్, ఉప్పల్ మైనారిటీ లీడర్ బద్రుద్దీన్, టీఆర్ఎస్ నాయకుడు రాగి ఎట్లా కృష్ణ (కిట్టు)తో పాటు పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోగికార్ శివకుమార్ మాట్లాడుతూ, తన జన్మదినాన్ని ఆర్భాటాలకు దూరంగా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాల రూపంలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కాప్రా డివిజన్ ప్రజల ఆశీర్వాదంతోనే ఈ స్థాయిలో సేవ చేయగలుగుతున్నానని తెలిపారు. భవిష్యత్తులో కూడా పేదలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని, డివిజన్ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజాసేవలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమాలు కాప్రా డివిజన్‌లో మంచి ఆదరణ పొందాయి.

శ్రీ చైతన్య మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా ముగ్గుల పోటీలు..