మన ప్రగతి న్యూస్ / కుషాయిగూడ, మేడ్చల్ జిల్లా స్టాపర్ :
ఉద్యోగానికి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మౌలాలి హెచ్‌బీ కాలనీ పరిధిలోని ఇంద్రానగర్‌కు చెందిన రేణుక కుమార్తె ఎస్. పావని (19) సోమవారం (ఫిబ్రవరి 9) ఉదయం 8 గంటలకు తన పని నిమిత్తం బయటకు వెళ్లింది. సాయంత్రం 6 గంటల సమయంలో పావని తన తల్లికి ఫోన్ చేసి, ఇంటికి రావడం కొంచెం ఆలస్యమవుతుందని చెప్పింది. రాత్రి 8 గంటలకు తల్లి మళ్లీ ఫోన్ చేయగా.. తాను బస్టాప్‌లో ఉన్నానని, త్వరలోనే ఇంటికి చేరుకుంటానని తెలిపింది. అయితే, కొంత సమయం తర్వాత మళ్లీ ఫోన్ చేయగా ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినప్పటికీ పావని ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం తల్లి రేణుక కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

